ఈ బ్యాంక్ కస్టమర్స్ అదిరే ఆఫర్స్ ని పొందొచ్చు..!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. క్రెడిట్ కార్డు వంటి సదుపాయాలని కూడా ఇస్తోంది. అయితే మీరు కూడా దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదా మీరు దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.

SBI
SBI

ఈ కార్డ్స్ వున్న వాళ్లు నిజంగా బంపర్ ఆఫర్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు రూ.2000 ఫ్లాట్ తగ్గింపు పొందొచ్చు. ఈ నెల చివరి దాకా ఈ ఫెసిలిటీని పొందొచ్చు. తక్షణం రూ.2 వేల తగ్గింపు పొందొచ్చు. ఎంఐ 11 ఎక్స్ 5జీ ఫోన్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని గమనించాలి.

ఇది ఇలా ఉంటే 18 నెలలు వరకు నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనం పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అలానే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకి ఎలాంటి లాభం కలుగుతుంది అనేది చూస్తే… హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై రూ.1000 తగ్గింపు ఆఫర్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనే వారు ఈ ప్రయోజనం పొందొచ్చు. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంటుంది. ఈ నెల 15 వరకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ ని కూడా అమెజాన్ నుండి పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వారు 10 శాతం తక్షణ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 11 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.