హైదరాబాద్ లో దారుణం..6ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య..!

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక పై ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని దారుణంగా హత మార్చాడు. నిన్న సాయంత్రం 5గంటల నుండి చిన్నారి కనిపించకుండా పోయింది. దాంతో కుటుంబ సభ్యులు వెతకగా రాజు ఇంట్లో చిన్నారి విగత జీవిగా కనిపించింది.

rape
rape

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన పై బస్తివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని ఆందోళన కు దిగారు. అంతే కాకుండా పోలీసులపైకి దాడికి దిగారు. కాలనీ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తో 300 మంది పోలీసులు బందబస్తు ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారి లో ఉన్నాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.