ఎస్బీఐ బెస్ట్ స్కీమ్..ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు డబ్బులే డబ్బులు..

-

తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పథకాల కోసం జనాలు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు.స్టాక్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..పెట్టుబడిదారులకు ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న sbi యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ పథకం ఇన్వెస్టర్లకు గ్యారెంటీడ్‌ రిటర్న్స్ అందిస్తుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల ఏ రిస్క్ ఉండదు. అంతేకాదు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. మరి ఈ పథకం గురించి వివరాలు తెలుసుకుందాం..

ఈ స్కీమ్ లో ఒకసారే డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలి.కనీసం రూ.36 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు కాబట్టి మీరు ఎంత మొత్తంలోనైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్వెస్ట్ చేసిన కొంతకాలం తర్వాత పెట్టుబడిదారులు ప్రతి నెలా ఒకే మొత్తంలో డబ్బు అందుకుంటారు. ఈ రిటర్న్స్‌ను మీరు డిపాజిట్ చేసిన అమౌంట్‌లో కొంత మొత్తం, వడ్డీని కలిపి ఎస్‌బీఐ చెల్లిస్తుంది.వడ్డీ అనేది మీ ఖాతా అమౌంట్ పై ఉంటుంది.

36, 60, 84 లేదా 120 నెలల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత, కస్టమర్లు బ్యాంక్ నుంచి ప్రతి నెలా రిటర్న్‌లను పొందుతారు. ఈ పథకం కింద పెట్టుబడిదారులు తమ ఇనిషియల్ డిపాజిట్‌కి ముందుగా నిర్ణయించిన నెలవారీ మొత్తాన్ని అందుకుంటారు. ఇన్వెస్టర్లు నెలలో ఏ తేదీన డిపాజిట్ చేశారో అదే తేదీన ఎస్‌బీఐ రిటర్న్స్ అందజేయడం ప్రారంభిస్తుంది..ఈ స్కీమ్ ను సమీపంలోని బ్రాంచ్ కు వెళ్ళి తెలుసుకోవచ్చు..

భారత్‌లో నివసించే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే ఈ ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు… ఇక్కడ బ్యాంక్ ఖాతా ఉండి, వేరే దేశంలో ఉండే వారికి ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం కుదరదు..

Read more RELATED
Recommended to you

Latest news