తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పెట్రోల్, డీజిల్ కు కటకటే లేదు. అలాంటి ఇప్పుడు చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఉదయాన్నే పెట్రోల్ కొట్టించుకుందామంటే బంకుల ముందు ఈ బోర్డులు దర్శనమిస్తూండడంతో వినియోగదారుల గుండెలు లబ్ డబ్ అంటున్నాయి. నిజానికి ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రి గంగుల కమలాకర్ గత పది రోజుల క్రితమే చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లతో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు.
కలిసికట్టుగా పనిచేస్తూ సమస్య రాకుండా చూడాలన్నారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వినియోగదారుల నుంచి ఒత్తిడి ఇంకా పెరుగుతుందంటున్నారు డీలర్లు. పెట్రోల్ కొరత పై ప్రజలు, మీడియా సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో చమురు సంస్థలు డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ పెంచడానికి ప్రయత్నించాయి. అసలు సమస్య ఎక్కడ ఏర్పడుతుంది అంటే.. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల లోపే చమురు సంస్థల ఖాతాలకు డబ్బులు డిపాజిట్ చేస్తేనే.. శనివారం నాడు డెలివరీ ఉంటుంది.
ఒక వేళ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు డబ్బులు జమ చేయడం అవ్వకపోతే..రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు పనిచేయవు. అంటే మళ్లీ సోమవారం నాడు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయడానికి అవుతుంది. అంటే శనివారం, ఆదివారం, సోమవారం నాడు పెట్రోల్ లేక నో స్టాక్ బోర్డు పెట్టక తప్పడంలేదంటున్నారు డీలర్లు.