సికింద్రాబాద్ రైల్వే అల్లర్లతో మా పిల్లలకు సంబంధం లేదు..కేసీఆర్, కేటీఆర్ న్యాయం చేయాలని ఆందోళనకారుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి చంచల్ గూడా జైల్ వద్దకు భారీగా ఆందోళనకారుల కుటుంబాలు తరలి వస్తున్నాయి. ములఖత్ లో తమ వారిని కలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లి దండ్రులు.
తమకు ఏ పాపం తెల్వదని తల్లిదండ్రులతో గోడు వెల్లబోసుకుంటున్నారు యువకులు. సమగ్ర దర్యాప్తు చేసి ఎవరు కుట్ర చేశారో తేల్చాలని తల్లి దండ్రులు డిమాండ్ చేశారు. మా పిల్లలు విద్వంసంలో పాల్గొనలేదు. నిరసన కోసం మాత్రమే వచ్చారని.. ఉద్యోగం కోసం గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో కోచింగ్ తీసంకుంటున్నారు. మా పిల్లలకు ఏ పాపం తెలియదని చెబుతున్నారు. ప్రభుత్వం కలుగజేసుకొని బెయిల్ పై విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలి.. సీఎం కేసీఆర్, కేటీఆర్ కలుగజేసుకొని న్యాయం చెయ్యాలని గోడు వెల్లబోసుకుంటున్నారు అరెస్ట్ అయిన యువకుల తల్లిదండ్రులు.