SBI అదిరే స్కీమ్.. చేరితే అధిక రాబడి పొందొచ్చు..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని ఇస్తోంది. దీని వలన కస్టమర్స్ కి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అయితే దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు ఇస్తున్న సేవల్లో ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. అయితే ఇది ప్రత్యేకమైన స్కీమ్. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI
SBI

ఈ స్కీమ్ లో కనుక చేరితే ఎఫ్‌డీల FD కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో లేదు. కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్. దీని ద్వారా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ పధకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ 2020 మే నెలలో తీసుకు రావడం జరిగింది. 2021 సెప్టెంబర్ నెలతో ఈ స్కీమ్ గడువు ముగియాల్సి ఉంది.

కానీ ఎస్‌బీఐ ఈ స్కీమ్ గడువును 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం కనీసం 5 ఏళ్లుగా ఉంది. అంటే ఐదు ఏళ్ల కాల పరిమితితో డబ్బులు పెడితే అధిక వడ్డీ వస్తుంది.

పదేళ్ల వరకు కూడా డబ్బులు వుంచుకోచ్చు. సాధారణ కస్టమర్ల కన్నా 0.5 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అదే ఉయ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే.. మరో 0.3 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. అంటే 0.8 శాతం అధిక వడ్డీని పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.2 శాతం వడ్డీ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news