జూన్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు హాలిడేస్ తెలుసా? ఏయే రోజులు అంటే..

-

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. మే నెల మరో మూడు రోజుల్లో ముగియనుంది. బ్యాంకు పనులను నిమిత్తం వెళ్లేవారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌. లేకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది.. అందుకే బ్యాంకు పనికి వెళ్లే ముందు ఎన్ని రోజులు, ఏయే రోజులు సెలవులు అనేది ముందుగానే తెలుసుకోవడం బెస్ట్.. మరి ఆలస్యం ఎందుకు వచ్చే జూన్ నెలలో ఎన్నిరోజులు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.. ఇక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకులకు ఉండే సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఇక జూన్‌ నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.. అవేంటో ఓ లుక్ వేద్దాం..


జూన్​ 4 – ఆదివారం
జూన్​ 10- రెండో శనివారం
జూన్​ 11- ఆదివారం
జూన్​ 15- రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
జూన్​ 18 -ఆదివారం
జూన్​ 20 – రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.
జూన్​ 24 -నాలుగో శనివారం
జూన్​ 25 -ఆదివారం
జూన్​ 26 – ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు.
జూన్​ 28- ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.
జూన్​ 29 – ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.
జూన్​ 30 -రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు..

ఈ రోజులలో బ్యాంకులు సెలవులు..అయినా కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు..ఇది గుర్తుపెట్టుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news