గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని, అందుకోసం డబ్బులు ఇవ్వజూపిన కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆనాడు ఓటుకు నోటు కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు. అయినప్పటికీ ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది.
ఈ కేసును రాష్ట్ర హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓటుకు నోటు కేసు పిటిషన్‌ను సుప్రీం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. మొన్నటివరకు ఈ కేసును విచారించిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అందుకే ఆయన ఈ కేసు ఈ విచారణ నుండి వైదొలిగారు.దీంతో ఈ కేసును మరో ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేయనుంది.