తెలంగాణలో రేపటి నుంచి (నవంబర్ 6) కులగణన ప్రారంభం కానుంది. ఈ సర్వేలో కులం పేరు ఎవరైనా తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కారుకు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సిఫారసు చేశారు. అన్ని కులాల లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని, భవిష్యత్ లో మళ్లీ కులగణన ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు.
ఎన్యుమరేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేసినా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని నిరంజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలాఉండగా, కులగణన ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచ్చేయనున్నారు.ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయనున్నందున రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడనున్నారు.