బిర్యానీ ప్రియులకు షాక్.. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ సీజ్

-

మీరు బిర్యానీ ప్రియులా? అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ లో బిర్యానీ అంటే పడి చచ్చిపోతారా? అయితే.. మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. ఇప్పుడు మీరు బావర్చి హోటల్ లో బిర్యానీ తినలేరు. దాన్ని సీజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నమే ఆ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బావర్చి యాజమాన్యం.. వ్యర్థ పదార్థాల నిర్వహణను సరిగ్గా చేపట్టడం లేదట. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం లేదట. ఇదివరకు చాలా సార్లు హోటల్ కు నోటీసులు పంపించినా బావర్చి యాజమాన్యం పట్టించుకోలేదట. దీంతో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 ఏఎంహెచ్వో హేమలత ఆధ్వర్యంలో హోటల్ ను సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకులు.. వ్యర్థ పదార్థాల నిర్వహణను సరిగ్గ చేపట్టక పోగా… వ్యర్థ పదార్థాలను మ్యాన్ హోల్ లోకి వదులుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బావర్చితో పాటు… దాని పక్కనే ఉన్న ఆస్టోరియా, మిగితా హోటళ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్టు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news