2022 మహిళల ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

2022 సంవత్సరంలో..జరిగే ప్రపంచ కప్‌ కోసం మహిళల క్రికెట్‌ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. బీసీసీఐ. టీమిండియా కెప్టెన్‌ గా మిథాలీ రాజు ను నియమించిన బీసీసీఐ…. హర్మన్‌ప్రీత్ కౌర్ ను వైఎస్‌ కెప్టెన్‌ గా నియామకం చేసింది. అలాగే… రిచా, తానియాలను వికెట్‌ కీపర్లు గా ఎంపిక చేసింది బీసీసీఐ. 2022 ప్రపంచ కప్‌ జట్టు తో సహా… న్యూజిలాండ్‌ తో జరిగే టీ 20, వన్డేలకు కూడా జట్టు ప్రకటించింది బీసీసీఐ.

జట్ల పూర్తి వివరాలు :

ICC మహిళల ప్రపంచ కప్ 2022 & న్యూజిలాండ్ ODIలకు టీమ్ ఇండియా జట్టు:

మిథాలీ రాజ్ (సి), హర్మన్‌ప్రీత్ కౌర్ (విసి), స్మృతి, షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (డబ్ల్యుకె), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (డబ్ల్యుకె), రాజేశ్వరి, పూనమ్

న్యూజిలాండ్‌తో ఏకైక టీ20కి టీమ్ ఇండియా మహిళా జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన(VC), షఫాలి, యాస్తిక, దీప్తి, రిచా(WK), స్నేహ రాణా, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (WK), రాజేశ్వరి, పూనమ్, ఏక్తా, S. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్