వివాదంలో ‘‘ఆచార్య’’ ఐటెం సాంగ్… మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్ఎంపీ సంఘం ఫిర్యాదు.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘‘సానా కష్టం’’ ఐటెం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు, రెజీనా అందాలు సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ప్రస్తుతం ఈ సాంగ్ వల్లే వివాదం మొదవలైంది. ఆచార్య సినిమా వివాదంలో చిక్కుకుంది. ‘‘సానా కష్టం’’ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం ఫిర్యాదు చేసింది. జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట రచయిత, దర్శకులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సానా కష్టం పాటలో ‘‘ ఏడేదో నిమరచ్చని కుర్రోళ్లు ఆర్ఎంపీలు అయిపోతారనే’’ లిరిక్ అభ్యంతరంగా ఉందంటూ ఆర్ఎంపీలు ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం ఈ ఆర్ఎంపీల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే చరిత్రను వక్రీకరించారని ట్రిపుల్ ఆర్ సినిమాపై కూడా వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై తెలంగాణ హైకోర్ట్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.