ఏపీ రాజధాని అమరావతి విషయంలో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు జగన్ ప్రభుత్వం రాజధాని అంశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అలా జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోవడం…వాటికి బ్రేకులు పడటం జరిగిపోతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని కాదని, మూడు రాజధానులని తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు పడ్డాయి. దీంతో మూడు రాజధానులు ముందుకు కదలలేదు. దీంతో మూడు రాజధానుల బిల్లులో తప్పులు ఉన్నాయని, వాటి సరిదిద్దుకుని మళ్ళీ కొత్త బిల్లుతో ముందుకొస్తామని జగన్ మరో ట్విస్ట్ ఇచ్చారు.
దీంతో రాజధాని అంశం తేలలేదు. అయితే ఇంకా ఇప్పటిల్లో మూడు రాజధానుల బిల్లు రాదని అమరావతి మద్ధతుదారులు భావిస్తున్నారు. ఇక ఈలోపు జగన్ ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 19 గ్రామాలని ఒక కార్పొరేషన్‌గా చేయాలని డిసైడ్ అయింది. అయితే మొత్తం గ్రామాలని కలిపి చేస్తే ఎవరికి డౌట్ వచ్చేది కాదు…విడగొట్టి చేయడంతో అమరావతి రైతులకు డౌట్ వచ్చింది.
ప్రస్తుతం 19 గ్రామాలను ఓ మున్సిపల్ కార్పొరేషన్‌గా..మరికొన్ని గ్రామాలను మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తోంది. దీంతో జగన్ ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ దీని వెనుక ఏదో వ్యవహారం ఉందని భావిస్తున్నారు. అందుకే అన్ని గ్రామాల ప్రజలు నిర్మోహమాటంగా అమరావతి కార్పొరేషన్ ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అనుకూలంగా మాట్లాడటం లేదు.
ఇదిలా ఉంటే అమరావతి కార్పొరేషన్‌గా చేసిన తర్వాత రాజధాని గ్రామాల్లో ఆరు వేల ఎకరాలు అదానీ సంస్థకు తాకట్టు పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం మాత్రం వస్తుంది..అందుకే అమరావతి గ్రామ ప్రజలు కార్పొరేషన్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఏదొక ట్విస్ట్ ఇస్తూనే ఉంది…అలాగే అమరావతి విషయంలో ప్రభుత్వానికి షాకులు కూడా తగులుతూనే ఉన్నాయి.