ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, ప్లేయర్స్ కు బీసీసీఐ కీలక ఆదేశాలు

-

ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగే రోజు ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్టేడియం నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మ్యాచ్‌ జరిగే రోజు వ్యాఖ్యాతలు, ప్లేయర్స్, ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్‌ జట్లకు సంబంధించిన సోషల్ మీడియా, కంటెంట్ టీమ్‌లు స్టేడియం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం.

ఇటీవల ఓ మ్యాచ్‌లో వ్యాఖ్యానిస్తున్నప్పుడు మాజీ ఇండియా బ్యాటర్ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ప్రసార హక్కులు పొందినవారు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బ్రాడ్‌కాస్టర్లు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. కాబట్టి ఇకపై ప్లేయర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కామెంటేటర్ల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news