విజయ్ దళపతి మూవీలో తెలుగు బిగ్ బాస్ బ్యూటీ !

-

బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా తమిళ స్టార్ విజయ్ తలపతి మూవీలో లక్కీ ఛాన్స్ కోటేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లా వైరల్ అవుతోంది. రతికా నక్కతోక తొక్కింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ మూవీ తరువాత మరో స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయనున్నాడట విజయ్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం రతికా రోజ్ ను సెలెక్ట్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది మరి దీనిలో నిజం ఎంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news