చాలా మంది కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటూ వుంటారు. కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అయితే చాలా మంది వారి సంపాదించిన డబ్బుని పొదుపు చెయ్యాలని చూస్తూ వుంటారు. మీరు కూడా కోటీశ్వరులు కావాలని అనుకుంటున్నారా..? కలల్ని సాకారం చేసుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఎంతో అవసరం. అయితే ఈ స్కీము మీకు బాగా ఉపయోగ పడుతుంది. రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు కావాలంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టచ్చు.
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సాధారణంగా ఉంటుంది. దీనిలో ఉద్యోగి వాటా, యజమాని వాటా రెండూ కూడా జమ అవుతుంది. ఇలా జమ చేసిన మొత్తమే రిటైర్మెంట్ నాటికి సంపదగా మారుతుంది. ఉద్యోగి బేసిక్+డియర్‌నెస్ అలవెన్స్ కలిపిన వేతనం నుంచి 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో వేస్తారు. సంస్థ యాజమాన్యం కూడా అంతే అమౌంట్ ని ఈపీఎఫ్ అకౌంట్ లో జమ చేయాల్సి వుంది.
8.33 శాతం ఈపీఎస్ అకౌంట్‌లోకి, 3.67 శాతం ఈపీఎఫ్ అకౌంట్ లోకి వెళ్తాయి. ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు పెట్టచ్చు. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో రిక్వెస్ట్ సబ్మిట్ చేసుకోవాల్సి వుంది. వీపీఎఫ్ లో జమ చేసిన డబ్బులకి కూడా మీకు అంతే వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ 8.15 శాతంగా ఉంది. పన్ను చట్టం లోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 జమ చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఉద్యోగి రూ.2,50,000 వరకు వీపీఎఫ్‌లో జమ చేయొచ్చు. ఎలాంటి ట్యాక్సులు కూడా ఉండవు. విత్ డ్రాయల్స్, మెచ్యూరిటీ డబ్బులకూ ట్యాక్స్ అవసరం ఉండదు. నెలకు రూ.20,833 చొప్పున ఏడాదికి రూ.2,50,000 వీపీఎఫ్ అకౌంట్‌లో 30 ఏళ్ల పాటు కడితే రూ.3 కోట్ల వరకు రిటర్న్స్ వస్తాయి. 25 ఏళ్లు జమ చేస్తే రూ.2 కోట్లు, 20 ఏళ్లు జమ చేస్తే 1.2 కోట్లు వస్తాయి.