శ్రీశైలం ప్రమాద ఘటన లో వారికి లాభం.. విచారిస్తే వస్తుంది నిజం

-

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి ఎంపీ రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. సీబీఐతో పాటు సెంట్రల్‌ ఎలక్ట్రికల్ అథారిటీ(సీఈఏ)తో శాఖాపరమైన విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనలో క్రిమినల్ కోణం ఉందని ఆరోపించారు. వందల కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.ఈ ప్రమాదం జరగడం వల్ల కొందరికి లాభం జరుగుతుందని ఆరోపించారు. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.

అనుభవం లేని రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు ఎండీగా ఉండడం వల్ల జెన్కో, ట్రాన్స్కో నష్టాల్లో కూరుకపోయాయని ఆరోపించారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరపించాలని విజ్ఞప్తి చేశారు. బయట ఎవరి దగ్గరి నుంచి విద్యుత్ కొంటున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు.శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్​కు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్​కు వివరించారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్రమంత్రి ఆర్​కే సింగ్​ విచారం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news