కోర్ట్ ధిక్కార కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు రూపాయి 1 జరిమానా విధించింది. సెప్టెంబర్ 15 లోపు కట్టాలని ఆదేశాలు ఇచ్చింది. జరిమానాను జమ చేయడంలో విఫలమైతే, ప్రశాంత్ భూషణ్ మూడు నెలల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, మూడు నెలల పాటు ప్రాక్టీసు నుండి కూడా నిషేధించబడతారని ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన రెండు ట్వీట్లపై కోర్టు ధిక్కారానికి ప్రశాంత్ భూషణ్ ఈ నెల మొదట్లో సుప్రీం కోర్ట్ దోషిగా నిర్ధారించింది.
దీనిపై క్షమాపణ చెప్పాలని సుప్రీం పేర్కొన్నా సరే ఇది తన మనస్సాక్షిని ధిక్కరిస్తుందని ఆయన అన్నారు. ఆయనను శిక్షించడం ద్వారా “న్యాయవ్యవస్థ రాజనీతిజ్ఞత” చూపించాలని, భూషణ్ ను “అమరవీరుడు” గా మార్చవద్దని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీం కోర్టును కోరారు.