చాలా మంది తమ దగ్గర వుండే డబ్బుల్ని స్కీమ్స్ లో పెట్టాలని భవిస్తూ వుంటారు. అయితే పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. దీని వలన మంచిగా డబ్బులు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఒక పధకం. ఈ పధకం యొక్క కనీస కాలపరిమితి ఐదేళ్లు. ఇందులో ఎంతైనా పెట్టచ్చు. లిమిట్ ఏమి లేదు. కనీసం రూ.200 తో పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ప్రారంభించవచ్చు.
ఇది ఇలా ఉంటే 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంటుంది. ఈ స్కీమ్ లో రూ.1 లక్ష కంటే తక్కువ ఇన్వెస్ట్ చెయ్యాలి. రూ.1000తో మొదలు పెట్టొచ్చు. ఇందులో పెట్టిన పెట్టుబడి 118 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఎంత డబ్బు పెట్టినా ఈ స్కీమ్ లో రెట్టింపు అవుతాయి. ఒకవేళ మీరు రెండు లక్షలు పెడితే అవి నాలుగు లక్షలు అవుతాయి.
అలానే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో మంచిగా డబ్బులు వస్తాయి. 100 రూపాయల నుండి మొదలు పెట్టచ్చు. లిమిట్ ఏమీ లేదు. వడ్డీ రేటు 7.6శాతంగా వుంది. రిటైర్మెంట్ అయ్యాక డబ్బులు తీసుకొచ్చు. మిగతా మొత్తం పింఛను రూపంలో వస్తుంది. ఇందులో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. అలానే రూ.50వేల పెట్టుబడి వరకు సెక్షన్ 80సీసీడీ ప్రకారం పన్ను తగ్గింపు ఉంటుంది.