నెలకు కేవలం రూ. 1000తో ఈ స్కీమ్‌లో చేరండి.. రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ. 20వేలు..

-

మన దగ్గర కాస్త సేవింగ్స్‌ ఉండాలే కానీ.. మంచి మంచి స్కీమ్స్‌ ఉన్నాయి. మనకు వాటి గురించి తెలిస్తే చాలు. ఎవరో చెప్పింది నమ్మి మోసపోకుండా..మీకు మీరే ఆ స్కీమ్‌ గురించి తెలుసుకుంటే.. నెల నెల ఆదాయం కూడా వస్తుంది. అలాంటి వాటిల్లో బెస్ట్ ఆప్షన్‌ నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS). ఇది స్థిర రాబడిని అందిస్తుంది. ఇందుకు ప్రతి నెలా కొంత మొత్తంలో నగదును ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే రిటైర్మెంట్ తరువాత పెన్షన్ రూపంలో నెలవారీగా నగదు అందుకోవచ్చు.

నెలకు రూ.20 వేల పెన్షన్‌ :

ఒక వ్యక్తి 20 ఏళ్ల వయస్సులో NPSలో చేరి, నెలకు రూ.1,000 కాంట్రిబ్యూట్ చేస్తూపోతే, రిటైర్మెంట్ వరకు అతను చేసిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.5.4 లక్షలు అవుతుంది. ఏటా ఆశించిన 10 శాతం రాబడిని బట్టి మొత్తం పెట్టుబడి రూ.1.05 కోట్లకు చేరుకుంటుంది.

NPS సబ్‌స్క్రైబర్ కార్పస్‌లో 40 శాతాన్ని యాన్యుటీగా మారిస్తే, దాని విలువ రూ.42.28 లక్షలు అవుతుంది. యాన్యుటీ రేటు 10 శాతం అనుకుంటే, నెలవారీ పెన్షన్ రూ.21,140 అవుతుంది. అంతేకాకుండా NPS సబ్‌స్క్రైబర్ దాదాపు రూ.63.41 లక్షల మొత్తాన్ని పొందుతారు.

స్థిర రాబడి కోసం

ఎన్‌పీఎస్ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. మొదటగా ఈ పథకాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004లో తీసుకొచ్చారు.. ఆ తరువాత 2009లో అందరికీ వర్తింపజేశారు. రిటైర్మెంట్ తరువాత సురక్షితమైన స్థిర రాబడిని అందించడానికి ఎన్‌పీఎస్, ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పొదుపు మార్గాన్ని అందిస్తుంది.

అర్హత ప్రమాణాలు :

కచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి.
ఎన్‌ఆర్‌ఐలు కూడా అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయం నాటికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎన్‌పీఎస్ సూచించిన KYC నిబంధనలను పాటించాలి.

ఎన్‌పీఎస్- సిక్స్ లెవల్స్ రిస్క్ :

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) నిబంధనల ప్రకారం.. ఎన్‌సీఎస్‌లోని వివిధ స్కీమ్స్‌లో రిస్క్ ఆరు లెవల్స్‌లో ఉంటుంది. ఆ లెవల్స్‌లో తక్కువ రిస్క్, తక్కువ నుంచి మోడరేట్ రిస్క్, మోడరేట్ రిస్క్, మోడరేట్లీ హై రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ ఉన్నాయి. ఫండ్ మేనేజర్లు సబ్‌స్క్రైబర్‌లకు తాము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న స్కీమ్‌లో ఎంత రిస్క్ ఉంటుందో చెప్తారు.

కంట్రిబ్యూషన్ పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది

నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తం పెరిగే కొద్దీ, రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి తన కంట్రిబ్యూషన్ మొత్తాన్ని రూ. 2,500కి పెంచుకుంటే, 65 ఏళ్ల తర్వాత పెన్షన్ నెలకు రూ.52,000 అవుతుంది.

ఈ స్కీమ్‌ ఉద్యోగులకు చాలా హెల్ప్‌ అవుతుంది. నెలకు వెయ్యి రూపాయలంటే పెద్ద కష్టమేం కాదు. నెల నెల ఏం వేస్తాం అనుకుంటే.. సంవత్సరానికి సరిపడా డబ్బును ముందే తీసి పక్కన పెట్టుకోండి. అన్నీ బాగున్నప్పుడు మనతో అందరూ ఉంటారు. కానీ ఒకరోజు వస్తుంది. నెల నెలాజీతం రాదు..నీతో ఎలాంటి ఉపయోగం ఉండదు.. అప్పుడు పరిస్థితులు తారుమారు అవుతాయి.. 65 ఏళ్ల తర్వాత కూడా దర్జాగా బతకాలంటే..ఇప్పుడే మేలుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news