కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో రైతుల కోసం కూడా కొన్ని స్కీమ్స్ వున్నాయి. దీనిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులకి మంచి డబ్బులు వస్తాయి. ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందొచ్చు. అలాగే సులభంగా రుణాలు కూడా పొందొచ్చు.
మరి అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ఈజీగా పొందవచ్చు. ఈ కార్డు ఉంటే ఈజీగా బ్యాంక్స్ నుండి లోన్ వస్తుంది. పైగా దీనికి తక్కువ వడ్డీ పడుతుంది.
చాలా మంది రైతులు ఇప్పటికే ఈ కేసీసీ కార్డులు కలిగి ఉన్నారు. ఇది ఇలా ఉంటే పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ కూడా వుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులు సులభంగానే ఈ పథకంలో చేరచ్చు.
ఈ స్కీమ్ లో కనుక మీరు చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలి. ఎవరు ఈ స్కీమ్ కి అర్హులు అనేది చూస్తే.. 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఈ స్కీమ్ లో చేరచ్చు. అలానే ఈ స్కీమ్ వలన కలిగే లాభాలని పొందొచ్చు.