Faria Abdullah: బంగార్రాజుతో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు చేయ‌నున్న చిట్టి !

-

Faria Abdullah: కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా అనే హిట్ మూవీకి .. సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో నాగలక్ష్మి అనే పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి న‌టిస్తున్న‌ది. తాజాగా విడుదలైన ఆమె గ్లామరస్ లుక్కుకి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా.. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ నెటింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లాను తీసుకున్నట్టు తాజా సమాచారం. ఈ విష‌యాన్ని ఫ‌రియా నే చెప్పింది. కింగ్ నాగ్ తో కలిసి డ్యాన్స్ చేయడానికి చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. వెరీ షార్ట్ టైంలో సీనియర్ హీరో సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింద‌నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

మరి ఇక నాగార్జునతో చిట్టి చేయ‌బోయే.. ఆ ఐటెం సాంగ్ లో ఆమె డ్యాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ సినిమా ఫరియా అబ్దుల్లా కేరీర్ కు ఎలా ప్లెస్ అవుతుందో వేచి చూడాలి. ఈ సినిమాలో నాగార్జున స‌ర‌స‌న హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టించ‌నున్న‌ది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న విష‌యం తెలిసిందే.. చైతూకు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news