మన రోజుని ఎంత ఆనందంగా మొదలుపెడితే రోజంతా కూడా అంతే ఆనందంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజుని గుడ్ మార్నింగ్ అని ఇతరులకు చెబుతూ రోజును స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉండే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు అంటే దూరంగా ఉన్న వాళ్ళకి మెసేజ్లు పంపడం మనం చేసేదే. ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆ రోజు మొదలు పెట్టే అలవాటు ఉంటుంది.
శుభోదయం అని పూర్వ కాలం నుండి కూడా చెప్పుకుంటూ ఉండేవారు. అయితే అసలు ఉదయాన్నే లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ అని ఎందుకు చెప్పాలి..? గుడ్ మార్నింగ్ అని చెప్పటం వల్ల ఇతరులు ఆనందంగా మాత్రమే ఉంటారా..? ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా రోజును మొదలు పెట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు కూడా ఏదో ఒక రకమైన ఒత్తిడి ఆందోళన వారిలో ఉంటుంది. అయితే ఆ ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు గుడ్ మార్నింగ్ సహాయపడుతుంది. అవతలి వ్యక్తికి ప్రేమను పంచుతుంది. వాళ్లని శుభోదయం అని పలకరిస్తే వాళ్ల మనసు ఎంతో బాగుంటుంది పైగా మన చుట్టూ ఉండే వాతావరణం ఎంతో మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ని అది తీసుకు వస్తుంది.
నిజానికి ఇలా ఎవరైనా పలకరిస్తే మనకి ఉండే సమస్యలు అన్నీ కూడా మాయమైపోతాయి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. సుఖంగా సెక్యూర్ గా అనిపిస్తుంది. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మర్చిపోతాం. పైగా ఇలా పలకరించడం వల్ల రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలియని వారికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పచ్చు. దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిజానికి గుడ్ మార్నింగ్ అనేది సంస్కారవంతమైన అలవాటు.