ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే ఆ భారీ లక్ష్యాన్ని శ్రీలంక అవలీలగా చేదించింది. 19.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 174 లక్ష్యాన్ని చేదించింది శ్రీలంక.
అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా 41 బంతుల్లో 72 పరుగులు చేశారు రోహిత్. ఈ క్రమంలో రోహిత్ శర్మ అరుదైన రికార్డులను నెలకొల్పారు. ఆసియా కప్ టోర్నీలో ఇండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. టీమిండియా తరఫున టోర్నీలో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆసియా కప్ లో టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్ 971 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. అయితే తాజాగా ఆ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.