ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకు వచ్చింది. వీటిల్లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్ఐ) ఒకటి. ఈ పాలసీ వలన ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. మరి ఈ పాలసీ గురించి పూర్తిగా చూస్తే… 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
కనిష్టంగా రూ.10వేలను గరిష్టంగా రూ.10 లక్షలను ఇందులో పొదుపు చేయడానికి వీలు అవుతుంది. అయితే ఈ పాలసీ 4 ఏళ్లు అయ్యాక లోను సదుపాయం అందిస్తారు కూడా. అయితే 5 ఏళ్ల లోపు ఉపసంహరించుకుంటే మాత్రం బోనస్ ఉండదు.
పాలసీదారుడు డబ్బును పొదుపు చేసుకుంటే అతనికి 80 ఏళ్ల వయస్సు వచ్చాక పాలసీ మెచూర్ అవుతుంది. ఒకవేళ పాలసీ దారుడు మరణిస్తే ఆ మెచూరిటీ మొత్తం అతని నామినీకి అందుతుంది. ఈ విషయాలని గమనించాలి. ఈ పథకంలో చేరేందుకు అవసరం అయితే వయస్సును 50, 55, 58, 60 ఏళ్ల వరకు పొడిగిస్తారు కూడా.
30 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల వరకు ప్రీమియం కడితే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అనుకుంటే నెలకు రూ.1045 ప్రీమియం కట్టాలి. మొత్తం 30 ఏళ్లకు రూ.9 లక్షల బోనస్ ఇస్తారు. ఇది ఇలా ఉంటే అసలు రూ.5 లక్షలు, బోనస్ రూ.9 లక్షలు కలిపి రూ.14 లక్షలు చెల్లిస్తారు. రూ.1000కి రూ.60 బోనస్ ఇస్తారు. రూ.1 లక్షకు రూ.6వేలు బోనస్ లభిస్తుంది. ఒకవేళ రూ.5 లక్షలకు అయితే రూ.30వేలు ఇస్తారు.