ఒక విచిత్రమైన సంఘటన బెంగాల్ లో చోటు చేసుకుంది. చనిపోయాడు అనుకున్న కరోనా రోగి ఆయన దశదిన కర్మకు ఒక్కరోజు ముందు తిరుగి వచ్చారు. పశ్చిమ బెంగాల్ యొక్క ఉత్తర 24 పరగణాల జిల్లా కు చెందిన ఓ కరోనా రోగి ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు “అతని మృతదేహాన్ని” తీసుకొచ్చి దహన సంస్కారాలు జరిగిన వారం తరువాత ఆయనకు దశ దిన కర్మ చేయాలనీ సంకల్పించారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ ఆయన ఇంటికి రావడంతో ముందు వణికిపోయినా తరువాత విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
COVID-19 పాజిటివ్ వచ్చిన ఈ 75 ఏళ్ల వ్యక్తిని నవంబర్ 11న బరాసత్ లోని ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత ఆయన చనిపోయాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వబడింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచారు, COVID ప్రోటోకాల్‌లను అనుసరించి, కుటుంబ సభ్యులకు దూరం నుండి చూపించారు, దీంతో వారు ముఖాన్ని స్పష్టంగా చూడలేదు. “మేము మృతదేహాన్ని దహనం చేశాము ఈ రోజు దశదిన కర్మ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాము. అయితే, నిన్న మాకు కాల్ వచ్చింది. నా తండ్రి కోలుకున్నారని మాకు చెప్పారు మరియు ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం మేము ఏర్పాటు చేయాలి” అని ఆయన కుమారుడు చెప్పారు.మేము ఎవరిని దహనం చేశామో మాకు తెలియదు” అని అతను చెప్పాడు.