చాలా మంది రిటైర్ అయ్యే టైం కి చక్కగా భవిష్యత్తు ని ప్లాన్ చేస్తూ వుంటారు. పదవీ విరమణ తర్వాత కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. 60 ఏళ్ల పాటు కష్టపడి, సంపాదించి, కుటుంబ బాధ్యతలు ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా అరవై తరవాత వుండవు. హ్యాపీ గా రిలాక్స్ గా ఉండచ్చు. అయితే రిటైర్ అయ్యాక ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. స్థిరమైన ఆదాయం మీకు ఉండాలి. అందుకోసం ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి కూడా ప్లానింగ్ ఎంతో అవసరం.
పదవీవిరమణ తర్వాత మంచి రాబడులనిచ్చే ప్రభుత్వ పథకాల గురించి ఈరోజు మనం చూద్దాం. కేంద్రం పలు రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ సామాజిక భద్రతా స్కీము. ఈ స్కీమ్ కోసం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. కనీసం నెల వారీ పెన్షన్ రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000 లేదా రూ. 5,000 పొందే అవకాశం ఉంది. అరవై ఏళ్ల వయసు నుంచి పెన్షన్ ని పొందొచ్చు.
అలానే సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఉంది. కనీసం రూ. 1,000, గరిష్టంగా రూ. 30 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం కూడా వుంది.
రూ. 1,000 నుండి ఇందులో పెట్టచ్చు. గరిష్టంగా రూ. 9 లక్షల డిపాజిట్ చెయ్యచ్చు. ఉమ్మడి ఖాతాలకు గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. జాతీయ పెన్షన్ పథకం కూడా వుంది. ఈ స్కీమ్ కూడా బాగుంటుంది.