మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడం మొదలు పాన్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. అయితే పాన్ కార్డుని ఆధార్ కార్డు తో లింక్ చెయ్యడం చాలా ముఖ్యం.
దీనికి చివరి తేది గతేడాది సెప్టెంబర్ 30 అయినప్పటికీ.. గడువుని మార్చి 31, 2022 వరకు ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే కొందరు పాన్ కార్డును, ఆధార్‌తో లింక్ చేసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈ తప్పు చేస్త కనుక రూ.10 వేల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డు నెంబర్ నమోదు చేసే ముందు పాన్ కార్డుపై ఇచ్చిన పది అంకెల పాన్ నెంబర్‌ను మాత్రమే ఎంటర్ చేయాలి.
చాలా జాగ్రత్తగా ఈ నెంబర్లను నమోదు చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే అప్పుడు మీకు భారీ మొత్తంలో పెనాల్టీ విధిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. కనుక ఈ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఒకవేళ మీ దగ్గర రెండు పాన్ కార్డులుంటే కూడా మీరు భారీగా పెనాల్టీని భరించాల్సి ఉంటుంది.
ఈ మూలంగా మీ బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశం వుంది. రెండు కార్డులు కనుక ఉంటే రెండో పాన్ కార్డును ఆదాయపు పన్ను డిపార్ట్‌మెంట్ దగ్గర సరెండర్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డును సరెండర్ ఎలా చెయ్యాలి అనేది చూస్తే..
ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
‘Request For New PAN Card Or/ And Changes Or Correction in PAN Data‘పై క్లిక్ చేయాలి.
ఆ తరవాత ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆ ఫామ్‌ను నింపాలి.
ఆ తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్ ఆఫీసుకి వెళ్లి దీనిని ఇచ్చేయాలి.
రెండో పాన్ కార్డును సరెండర్ చేసేటప్పుడు ఈ ఫామ్‌ను కూడా ఇవ్వాలి.
అలానే ఆన్‌లైన్‌గా కూడా రెండో పాన్ కార్డును సరెండర్ చేయొచ్చు.