ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేస్తే… చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు తెరిచాడు: కొడాలి నాని

-

తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి మద్యపాన నిషేధం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని.. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వైన్ షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూంలు పెట్టి మద్యాన్ని పారించిన వ్యక్తి అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఈనాడు రామోజీ రావు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యంపై ఆదాయాన్ని పొగొట్టుకోవద్దని కథనాలు రాశారని.. ఈనాడు రామోజీ రావుకు వయసు వచ్చింది కానీ బుద్ధిరాలేదని ఆయన విమర్శించారు. జంగారెడ్డి గూడెంలో  సహజమరణాలను కల్తీ మద్యం కేసులను టీడీపీ కల్తీ మద్యం కేసులుగా మారుస్తోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి దొరకడం దురద్రుష్టకరం అని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అని ఆయన అన్నారు. సిగ్గు లేకుండా సభలో మాట్లాడుతున్నారని అన్నారు. పేద వాడికి మద్యం అందుబాటులో ఉండకుండా సీఎం జగన్ మద్యం రేట్లు పెంచితే… ధరలు తగ్గించాలని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news