కరోనా వైరస్ తో చాలా చాలా జాగ్రత్త. ఎవరూ కూడా అశ్రద్ధ చేయవద్దు. అసలు అశ్రద్ధ చేయవద్దు. తెలుగు రాష్ట్రాలకు దీని ప్రభావం లేకపోవచ్చు. కానీ కరోనా వైరస్ తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. కర్ణాటక లో మరణించిన వృద్దుడు హైదరాబాద్ లో చికిత్స పొందాడు. అదే విధంగా కరోనా అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. 81 కేసులు మన దేశంలో నమోదు అయ్యాయి.
చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వైద్యులను సంప్రదించడం, జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయండి. మాస్క్ లేకుండా అసలు బయటకు రావొద్దు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అసలు తినవద్దు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకోండి. విదేశాల నుంచి వచ్చిన వారితో స్నేహం చేయవద్దు. వాళ్లకు షేక్ హ్యాండ్ అసలు ఇవ్వొద్దు. పిల్లలు అయినా పెద్దలు అయినా ముద్దులు అలాంటివి ఇవ్వకండి.
తేడాగా ఉంటే కచ్చితంగా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళండి. మాస్క్ తప్పనిసరిగా కొనుక్కోండి. కొనుకున్న మాస్క్ ని మార్చుకోండి. తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఓడిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై, నాగపూర్ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు వద్దు. సినిమాలకు దూరంగా ఉండండి. జనాల్లో చేసుకునే ఏ వేడుక కూడా వద్దు.