సూర్యగ్రహణం కారణంగా భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయం, రేపు ఉదయం ఆలయం 10 గంటలకు మూసివేసి సాయంత్రం 7:15 నిమిషములకు తెరచి ఆలయ సంరక్షణ అనంతరం స్వామివారికి ఆరాధన మరియు దర్బారు సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. రేపు ఆలయంలో ఆర్జిత సేవలు మరియు నిత్య కళ్యాణం రద్దు చేయడం జరిగింది.
ఎల్లుండి తెల్లవారుజాము నుండి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. ఇక రేపు సూర్య గ్రహణం కారణంగా భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్య క్షేత్రంలో దీపావళి వేడుకలు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఘనంగా నిర్వహించారు.
ఈ రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం అర్చక స్వాములు ముందుగా ప్రమిదలతో ఆలయ ప్రొదక్షిణ నిర్వహించారు అనంతరం నరకాసుర వద కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆలయంలో దీపావళి మతాబులు కాలుస్తూ ఎంతో ఘనంగా సంబురంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆలయ వైదిక కమిటీ ఈరోజే దీపావళి పండుగ జరుపుకోవాలని నిర్ణయించడంతో ఆలయంలో అర్చక స్వాముల బృందం మరియు సిబ్బంది ఘనంగా దీపావళి సంబరాలు నిర్వహించారు.