తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన ఛాన్స్ దక్కింది. తెలంగాణ, భద్రాద్రి కి చెందిన 17 ఏళ్ల గొంగడి త్రిష, తాజాగా భారత అండర్ 19 క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన రావడంతో, జిల్లా వాసులు త్రిషను ప్రత్యేకంగా అభినందించారు. త్రిష తండ్రి వెంకట్రామిరెడ్డి కాగా, తల్లి మాధవి. ఇక వెంకట్రామిరెడ్డి, భద్రాచలం మార్కెట్ రోడ్ లో వ్యాయామశాల నిర్వహించేవాడు.
అదేకాక ఐటిసి పిఎస్ పిడి లో ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా పనిచేసేవాడు. త్రిష ఐదవ తరగతి వరకు, స్థానిక సెయింట్ పాల్స్ స్కూల్లోనే చదువుకుంది. క్రీడాలపై అవగాహన ఉన్న వెంకట్రామిరెడ్డి, కుమార్తె ఆసక్తి మేరకు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించేవాడు. అంతేకాక స్థానిక క్రికెట్ కోచ్ లా సాయంతో, ఐదేళ్ల వయసు నుంచే త్రిషకు క్రికెట్ లో శిక్షణ ఇప్పించారు. కొద్దికాలంలోనే త్రిష గేమ్ లో మంచి పట్టు సాధించింది. ఈ నేపథ్యంలోనే, తాజాగా భారత అండర్-19 క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకుంది.