అప్పుడే పుట్టిన బిడ్డతో గడపడానికి లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన తండ్రి..

-

జీవితంలో తల్లి, తండ్రి అవడం అనేది ఎవ్వరికైనా..మధురజ్ఞాపకమే…అప్పుడే పుట్టిన బిడ్డను అరచేతుల్లోకి తీసుకుంటే వచ్చే ఆనందం కోట్లు ఇచ్చినా రాదు.. ఎవరికైనా అవి స్పెషల్‌ మూమెంట్స్‌హే..! అయితే జీవితం బాగుండాలంటే…జీతం బాగారావాలి.. నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని..అప్పుడే పుట్టిన కూతురితో గడపడటం కోసం.. వదిలేశాడు ఆ తండ్రి. తండ్రిగా వస్తున్న ప్రమోషన్‌ ముందు.. జీతం పెద్ద ఎక్కువ కాదనకున్నాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
తన నవజాత శిశువును చూసుకోవడం కోసం లక్షల విలువ చేసే ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అప్పుడే పుట్టిన బిడ్డతో ఎక్కువ సమయం గడపాలని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు అకింత జోషి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన అంకిత్ జోషిది విజయవంతమైన కెరీర్. ఓ సక్సెస్ ఫుల్ మనిషికి ఉండాల్సినవన్నీ అతనిలో ఉన్నాయి. అంతేకాదు అంకిత్ ఒక కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూడా.. తన నిర్ణయం గురించి హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో మాట్లాడుతూ.. తన కుమార్తె పుట్టడానికి కొన్ని రోజుల ముందు.. తాను ఉద్యోగానికి రిజైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగంలో అత్యధిక జీతం వస్తుందని.. అయితే తనకు తండ్రిగా వస్తున్న ప్రమోషన్ ముందు జీతం తక్కువ అనిపించినట్లు అంకిత్‌ తెలిపాడు. తాను ఉద్యోగానికి రిజైన్ చేసిన సమయంలో చాలామంది తనను హెచ్చరించారు.. భవిష్యత్తులో పరిస్థితులు కష్టమవుతాయని చెప్పారట.. అయితే అంకిత్‌ తీసుకున్న నిర్ణయానికి భార్య మద్దతు ఇచ్చిందని వెల్లడించారు. తాను వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కంపెనీలో ఎక్కువగా వివిధ ప్రాంతాలకు పర్యటించాల్సి వచ్చేదని అంకిత్ తెలిపాడు. అయితే ఇప్పుడు తాను అందుకు సిద్ధంగా లేనని.. కుమార్తె పుట్టిన తర్వాత ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.
కుమార్తె పుట్టిన తర్వాత..లాంగ్‌ లీవ్‌ తీసుకునే వాళ్లు ఉంటారు..కానీ ఇలా ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. చాలామంది..ఉద్యోగం ఒక్కటే చేస్తూ..లైఫ్లో చిన్న చిన్న ఆనందాలను మిస్‌ చేసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news