సరస్వతి దేవి పుట్టిన రోజు నాడు వసంత పంచమిను జరుపుకుంటారు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మాగమాసం శుద్ధ పంచమి నాడు వసంత పంచమిను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 16, మంగళవారం నాడు వచ్చింది. వసంత పంచమి రోజు సరస్వతీ దేవిని పూజించాలి అనుకుంటే ఉదయం 06:59 నుండి మధ్యాహ్నం 12:35 లోపు పూజించండి.
ఇదే వసంత పంచమి ముహూర్తం. సాధారణంగా విద్యార్థులు అందరూ వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే దేన్నైనా సాధించాలి అనుకునేవారు కూడా వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజించవచ్చు. దాంతో వారికి దేవి అనుగ్రహం కలుగుతుంది. వసంత పంచమి రోజు సరస్వతి దేవి పటానికి కానీ కలశానికి కానీ పుస్తకాన్ని కానీ పూజించవచ్చు. దేనికి పూజించినా సమాన ఫలితం వస్తుంది. నిజానికి సరస్వతి దేవికి తెలుపు మరియు పసుపు రంగు అంటే ఎంతో ప్రీతి.
కాబట్టి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పసుపు లేదా తెలుపు బట్టలు కట్టుకుని సరస్వతి దేవిను పూజించండి. పూజలో భాగంగా మొదట దీపాన్ని వెలిగించి, విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. ఆ తర్వాత సరస్వతి దేవిని సరస్వతి అష్టోత్తరం చదువుతూ పూజించండి. ఈ పూజలో సరస్వతీ దేవికి ఇష్టమైన పసుపు మరియు తెలుపు పువ్వులు మరియు అక్షింతలతో పూజించండి. పూజ అనంతరం అన్నంతో చేసిన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించండి. చిన్న పిల్లలు చేత అక్షరాభ్యాసం చేయించుటకు ఈ రోజు ఎంతో మంచిది.