భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా నాసికా టీకాను కేంద్రం ఆవిష్కరించింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌కొవాక్ పేరుతో భారత్ బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది.
“ఈ టీకా పంపిణీ చాలా సులువు. సూది అవసరం లేదు. ఈ టీకాతో ఐజీజీ, ఐజీఏ, టీ-సెల్ అనే మూడు రకాల ప్రతిస్పందనలు వస్తాయి. ప్రపంచంలో మరే ఇతర వ్యాక్సిన్‌తో ఇది సాధ్యం కాదు” అని కృష్ణ ఎల్ల వివరించారు.
గతేడాది నవంబర్లోనే ఇన్‌కొవాక్ వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. నాసికా టీకాను 18 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ డోసుగా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిన్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఈ టీకాను చేర్చారు. ఇకపై ప్రజలందరికీ ఈ టీకా అందుబాటులో ఉండనుంది.