కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ పై ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న ‘కోవాక్సిన్’ కనీసం 60 శాతం ప్రభావవంతంగా ఉంది అని ప్రక్కటించింది. 2021 రెండో త్రైమాసికంలో కొరోనావైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించాలని భారత బయోటెక్నాలజీ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు.
భారత్ బయోటెక్ క్వాలిటీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ సాయి డి ప్రసాద్ మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ కనీసం 60 శాతం ప్రభావాన్ని చూపించింది అని భావిస్తున్నాం. అది ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు అన్నారు. భారత్ బయోటెక్ మరియు ఐసిఎంఆర్ భారత్ లో ఈ వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ ఈ నెల ప్రారంభంలో టీకా 3 వ దశ హ్యూమన్ ట్రయల్స్ ని ప్రారంభించింది. ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాలలో 26,000 మంది వాలంటీర్లహో 3 వ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి.