మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు మాస్క్ పెట్టుకుంటే తప్పుగా చూసేవారు. ఇప్పుడు పెట్టుకోకపోతే తప్పుగా చూస్తున్నారు. అభిప్రాయాలు మారడానికి ఎంతో సమయం పట్టదని అర్థమైపోయింది. అదంతా పక్కన పెడితే, మాస్క్ ధరించడం అనివార్యమైన కారణంగా, దానివల్ల కలిగే చిరాకు నుండి ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం.
మాస్క్ ఎలాంటిదైనప్పటికీ ఎక్కువ సేపు వినియోగించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మాస్క్ కప్పి ఉంచే భాగాలైన ముక్కు, నోరు చుట్టూ చర్మం చికాకుకి గురి అవుతుంది. ఐతే ఒకే మాస్కుని ఎక్కువ రోజులు ఉపయోగించరాదు. అలాగే కాటన్ మాస్కులు ఉపయోగిస్తే బాగుంటుంది. మాస్కుని తరచుగా ఉతుక్కోవాలి. చాలా మంది మాస్కుని ఉతుక్కోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. ఒక రోజులో ఎక్కువ సేపు మాస్క్ ధరిస్తున్నట్లయితే అడిషనల్ గా మరొక మాస్క్ కూడా ఉంచుకోండి.
ఒకే మాస్కుని ఎక్కువ సేపు వాడడం వల్ల చర్మ సమస్యలు తొందరగా వస్తాయి.
మాస్క్ చర్మానికి బిగుతుగా పట్టుకుని ఉంటే తీసి పక్కన పెట్టి వేరే మాస్కుని వాడండి. బిగుతుగా పట్టి ఉంచే మాస్కుల వల్ల చర్మం సమస్యలు తొందరగా వస్తాయి.
మాస్క్ పెట్టుకోవడం వల్ల చర్మం వేడిగా మారుతుంది. దానివల్ల మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అనవసరమైన చోట మాస్క్ ఉపయోగించకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా బైకుల మీదా, కార్లలో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పుడు.
సో.. ఇదండీ.. మాస్క్ ఉపయోగించడం తప్పనిసరైనపుడు దానివల్ల కలిగే చర్మ సమస్యల నుండి బయటపడటం ఎలాగో కూడా తెలుసుకోవాలి. చర్మ సమస్యలు ఒక పట్టాన నయం కావు. అందుకే వాటిపట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.