కాంగ్రెస్ అభివృద్ది పై BRS కు సెల్ఫి ఛాలెంజ్… !

-

తెలంగాణ రాష్ట్రాన్ని గత ఎనిమిది సంవత్సరాల ముందు వరకు కాంగ్రెస్ చాలా కాలం పరిపాలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ నేతృత్వంలో BRS అధికారంలో ఉంది, BRS తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటి అంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది… గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పై BRS కు ఈ ఛాలెంజ్ విసిరింది. మేము చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన సెల్ఫీ తీసి పెడతామని భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగా మేము నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్, ECIL , BHEL, డ్రింకింగ్ వాటర్ లాంటి ఎన్నో ప్రాజెక్ట్ ల ఫోటోలు తీసి సెల్ఫీ ఛాలెంజ్ విసురుతామన్నారు.

అదే విధంగా మీ రెండు పర్యాయాలు పాలనలో ఏమి నిర్మించారో సెల్ఫీ తీసి పెట్టాలని భట్టి ఛాలెంజ్ చేశారు. మా కాంగ్రెస్ గురించి తప్పుడు ప్రచారాలు చేసే ఎవరికీ అయినా రాబోయే రోజుల్లో తగిన బుడ్డి చెబుతామని భట్టి క్లియర్ గా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news