65 ఏళ్ళ లోపు ఉన్న వారందరికీ దళిత బంధు : హరీష్ రావు

ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న దళితులందరికి దళిత బంధు డబ్బులు అందుతాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దళిత బంధు పై కలెక్టర్ కార్యాలయం లో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తామని పేర్కొన్నారు.

harish rao | హరీష్ రావు
harish rao | హరీష్ రావు

వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా అందోళన చెందవద్దని.. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచనలు చేశారు.

దళిత బంధు పథకం క్రింద వచ్చే రూ.10 లక్షలతో ఒక్కరూ 4 యూనిట్లు కూడా స్థాపించుకొవచ్చని.. దళిత బంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించమన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలందరికి మూడు రోజులలోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. ఖాతాలలో పడ్డ డబ్బులను ప్రభుత్వం వెనుకకు తీసుకోదని, ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలని పేర్కొన్నారు.