ముడతలు లేని చర్మానికి వేరుశనగపప్పుతో ఫేస్ మాస్క్.. రిజల్ట్ పక్కా..!

-

ముఖానికి ఉండే చర్మం.. ముడతలు లేకుండా ఉంటే బాగుండు అని ఏజ్ మీద పడే ప్రతి మహిళ అనుకుంటుంది. ఈరోజుల్లో చాలామందికి 30 దాటడంతోనే ఫేస్ మీద ఆ ఏజింగ్ ఎఫెక్ట్ కనపిస్తుంది. కానీ సినిమావాళ్లకు మాత్రం అసలు ఏజ్ ఎందుకు కనిపించదు, టీవీ సీరియల్స్ లో నటించేవారు కూడా ఏజ్ కనిపించకుండా కవర్ చేసుకుంటారు. వాళ్లంటే.. మేకప్ వేసుకుంటారు అనుకుంటాం.. కానీ మేకప్ ఒకటే కాదు.. వాళ్లు నాచురల్ గా ఉండే వాటిని కూడా చాలా ఫాలో అవుతారు.
దీనికోసం కొందరు.. ఆయిల్స్, కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ వాడుతుంటారు. కానీ ఇవి ఎక్కువ కాలం వాడటం వల్ల ఎక్కడలేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ ఏదో ఒకటి యూస్ చేయాలి..ఎలా అని చాలామంది అనుకుంటారు. మీ లాంటి వారికే.. సైంటిఫిక్ గా స్కిన్ టైటినింగ్ ఫేస్ మాస్క్ ను ఇంట్లో తయారుచేసుకోవచ్చు అని ప్రూవ్ చేసారు. అది ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం.
ఫేస్ మాస్క్ తయారు చేసే విధానం..
వేరుశనగపప్పులు ఒక స్పూన్, నువ్వులు ఒక స్పూన్ తీసుుకుని పాలల్లో నానపెట్టండి. మూడు స్పూన్ల పాలు పోస్తే.. మునిగిపోతాయి. ఒక గంటపాటు నానపెట్టి గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఫిల్టర్ చేయండి. ఆ పాలను తీసుకుని శనగపిండి అర స్పూన్, తేనె స్పూన్, కావాలంటే అలోవేరా జెల్ వేసుకుని ఫేస్ మాస్క్ అప్లై చేయండి. చేతులకు, మెడకు కూడా అప్లై చేయండి. డ్రై అయ్యే వరకూ ఉంచుకుని క్లీన్ చేసుకోవచ్చు.
ఈ ఫేస్ మాస్క్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే..
చర్మంలో కొలాజన్ మెష్ హెల్తీగా ఫామ్ అయితే స్కిన్ టైట్ గా ఉంటుంది. ఈ మెష్ డామేజ్ అవడం వల్లే ముడతలు వస్తాయి. వేరుశనగపప్పులో రెస్వర్టాల్( Resveratrol) అనే కెమికల్ కొలాజన్ ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వులు యాంటిఇన్ఫ్లమేటరీ. స్కిన్ సెల్స్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి నువ్వుల పాలు బాగా పనికొస్తాయి. ఇందులో శనగపిండి వేయడం వల్ల డెడ్ సెల్ లేయర్ తొలగించడానికి పనికొస్తుంది. ఇందులో వేసిన పాలు.. స్కిన్ ను స్మూత్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక అలవోరా జెల్ అనేది.. స్కిన్ సెల్స్ డీ హైడ్రేట్ కాకుండా.. హైడ్రేట్ గా ఉండేట్లు చేస్తుంది. నీళ్లు తక్కువ తాగడం వల్ల స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది. తేనె యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ గా బాగా పనికొస్తుంది. ఇన్ని లక్షణాలు తేనెలో ఉన్నాయి కాబట్టి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది రెగ్యులర్ గా ఫేస్ కు అప్లై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.. రిజల్ట్ పక్కాగా వస్తుంది.
ఎన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఎవరికీ కనిపించవు. ఏదో మందులేసుకుని మానేజ్ చేస్తాం. కానీ పైకి అందరికి కనిపించేది స్కిన్. అది మరీ 30 ఏళ్లకే ముడతలు పడితే.. నలుగురిలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చర్మం స్థితిని బట్టే ఏజ్ ఎంత అని చెప్పేస్తారు. కాబట్టి స్కిన్ పై ముడతలు తొలగించడానికి వేలకు వేలు ఖర్చుపెట్టి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే క్రీమ్స్ వాడేబదులు.. ఈ నాచురల్ హోమ్ రెమిడీస్ ను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణలు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news