నా కొడుకును అలాగే పెంచాను..లోకేష్ పై భువ‌నేశ్వ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

మ‌హిళ‌ను గౌర‌వించే సంస్కృతి ఉండేలా ఓ త‌ల్లిగా నారా లోకేష్ ను పెంచాన‌ని.. లోకేష్ రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు గౌర‌వం పెరిగేలా ప‌ని చేస్తాడ‌ని.. ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్టు మేనేజింగ్ ట్ర‌స్టీ, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. సోమ‌వారం తిరుప‌తి లో ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా నారా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ..

ఆడ పిల్లలంటే ఆట వస్తువులు కాదని… పనిలేక మా పై విమర్శలు చేస్తున్నారని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు నారా భువ నేశ్వ‌రి. సమాజానికి ఉపయోగం లేని విమర్సలెందుకు అని ప్ర‌శ్నించారు.అతి పెద్ద రాష్ట్రాన్ని త‌న‌ భర్త ఏ విధంగా అభివృద్ధి చేశా రో త‌న‌కు తెలుసని పేర్కొన్నారు. రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా పని చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియా డారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలి..ఉంటుంద‌ని తేల్చి చెప్పారు నారా భువ‌ నేశ్వ‌రి. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసని.. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోము.. బాధ పడమని చెప్పారు. ప్రజాసేవకే అంకితమవుతామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు నారా భువనేశ్వరి.