ఉక్రెయిన్​పై యుద్ధానికి రష్యా బ్రేక్.. అమెరికా రియాక్షన్ ఇదే..!

-

రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్​పై యుద్ధానికి ఒకరోజు బ్రేక్ ఇస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అమెరికా, ఉక్రెయిన్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరింత పుంజుకొని దాడి చేసేందుకు ఇదంతా రష్యా ఎత్తుగడ అని భావిస్తున్నాయి. ఈ బ్రేక్​పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.

‘ఆసుపత్రులు, నర్సరీలు, చర్చిలపై దాడులు చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారు. కాస్త ఊపిరి పీల్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బ్రేక్‌ ఇచ్చారని నేను భావిస్తున్నాను’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అలాగే దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్ మాట్లాడుతూ..‘ఆయన ప్రకటనల ఉద్దేశాలపై మాకు ఎలాంటి నమ్మకం లేదు. మళ్లీ పుంజుకొని, దాడి చేయడానికి ప్రయత్నించవచ్చు. పుతిన్‌ శాంతిని కోరుకున్నట్లు నటించడం ద్వారా ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇది యుద్ధం గతిని మార్చేలా ఏమి కనిపించట్లేదు. రష్యా నిజంగా శాంతిని కోరుకున్నట్లయితే.. ఉక్రెయిన్‌ సార్వభౌమ ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలి’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news