తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలో ఈరోజు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేగాక గంటకు 11 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో వాతవరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, జగిత్యాల,ఆదిలాబాద్, మంచిర్యాల , ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, కొత్తగూడెం,భుపాలపల్లి, సంగారెడ్డి ,మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మూడు రోజులు భారీ వర్షాలు కురిసే సూచలున్నాయని వెల్లడించింది.