తెలుగు లో ప్రసారమయ్యే ”బిగ్ బాస్” షో కు మాములు క్రేజ్ లేదు. తెలుగు టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ ప్రారంభం కాగానే.. అందరూ టీవి లకే అతుకు పోతారు. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ కు సంబంధించిన నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. దీంతో అందరి కన్ను బిగ్ బాస్ 5 (Bigg Boss 5) పై పడింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ 5 (Bigg Boss 5) తెలుగు ప్రోమో ను విడుదల చేసింది స్టార్ మా బృందం.
ఈ ప్రోమో అందరి అంచనాలను పెంచేసింది. అయితే.. తాజాగా బిగ్ బాస్ 5 నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ బిగ్ బాస్ 5 రియాలిటీ షో వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు స్టార్ మా బృందం ప్రకటించింది. ఈ షో ను సెప్టెంబర్ 5 నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది స్టార్ మా బృందం. ఇక సోమ నుంచి శుక్ర వారం వరకు రాత్రి 10 గంటలకు ఈ షో ప్రారంభం కానుండగా… శని మరియు ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.
Time to end the boredom. #BiggBossTelugu5 starting September 5th at 6 PM on #StarMaa pic.twitter.com/lcEtuEGGBq
— starmaa (@StarMaa) August 26, 2021