డయాబెటిస్ వాళ్ళు ఏం తినచ్చో, ఏం తినకూడదో తెలుసుకోండి..!

-

చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏమి తినాలి..?, ఏమి తినకూడదు అనేది ఇక్కడ ఉంది మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి. డయాబెటిస్తో బాధపడే వాళ్లు షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

వీటిని తీసుకుంటే మంచిది:

మెంతులు:

డయాబెటిస్ తో బాధపడే వాళ్లు రాత్రంతా కూడా మెంతుల్ని నానబెట్టుకుని.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాటిని తినండి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

టమాటా జ్యూస్:

షుగర్ పేషెంట్లుకి టమాటా జ్యూస్ చాలా మంచిది. దీనికోసం మీరు టమాటా జ్యూస్ చేసి దానిలో సాల్ట్, మిరియాలపొడి వేసుకుని ఖాళీ కడుపున తాగండి.

పాలు:

పాలలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది.

నీళ్లు ఎక్కువ తాగడం:

ఉదయాన్నే లేచి ఒక గ్లాసు నీళ్ళు తాగండి అదేవిధంగా రోజంతా కూడా ఎక్కువ నీళ్లు తాగండి.

వేపాకులు:

వేపాకులు కూడా షుగర్ పేషెంట్లకు మేలు చేస్తాయి వేపాకులతో జ్యూస్ చేసుకుని తాగితే కూడా చక్కటి ఫలితాలు పొందవచ్చు. అలానే డైట్ లో పాలకూర మొదలైన ఆకు కూరలు తీసుకోవచ్చు.

అదే విధంగా పాలు, పెరుగు, బటర్ మిల్క్, పుట్టగొడుగులు, కాలిఫ్లవర్, క్యాప్సికం, వెల్లుల్లి, బీన్స్, వంకాయ వంటివి తినొచ్చు. కీరదోస, ఉల్లిపాయ, క్యారెట్ వంటి వాటిలో సలాడ్స్ కూడా తినొచ్చు ఇక పండ్ల విషయానికి వస్తే.. జామ,పుచ్చకాయ, బత్తాయి, నిమ్మ, కమల, ఉసిరి, కివి తినచ్చు. నానబెట్టిన బాదం, వాల్ నట్స్, వేరుశనగ, సోయాబీన్స్ కూడా తినొచ్చు. అయితే ఏది ఏమైనా సరే షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినొద్దు. కొన్ని పండ్లలో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా షుగర్ ఎక్కువగా వుండే వాటిని తినకుండా ఉంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news