ఎర్ర చీరలో మతిపోయేలా దివి అందాలు, అతని కోసమేనా?

-

‘బిగ్​బాస్​’లో కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన వాళ్ళలో దివి ఒకరు. అంతకుముందు మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో కూడా నటించింది కానీ ఆ సినిమా ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఇక ‘బిగ్ బాస్’ షోతో సూపర్​ క్రేజ్​ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. ఫస్ట్ ప్లేస్​ను దక్కించుకుని మరింత హాట్ టాపిక్ అయ్యింది.

అప్పటి నుండీ తరచూ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఫాలోవర్లను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఐకాన్​గా మారింది.

ఆకర్షించే కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన గ్లామర్​తో సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ఈ సారి ఈ ముద్దుగుమ్మ ఓ కవితను క్యాప్షన్​గా జోడిస్తూ.. లేటెస్ట్ ఫొటోషూట్​ను పోస్ట్ చేసింది.

“కుంకుమ జాలీ లేదా ఈ అమ్మాయి మీదా? ఎప్పుడూ నుదుటి మీదే ఉండటం న్యాయమా? అప్పుడప్పుడు తన గుండెల్ని తాకుతూ ఉండచ్చూ కదా, చాలా హాయిగా ఉంటుంది నాకు” వ్యాఖ్య రాసుకొచ్చింది.

మరి ఈ వ్యాఖ్యను ఆమె ఎందుకు రాసుకొచ్చిందా, దాని అర్థం ఏంటి ఆరాటపడుతున్నారు నెటిజన్లు. కొంతమంది ఆమె పెళ్లి చేసుకోబోయేవాడు కోసం ఎదురచూస్తోందని అందుకే ఇలా పెట్టిందని అనుకంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫొటోషూట్​ను ఓ సారి చూసేద్దాం..

Read more RELATED
Recommended to you

Latest news