Big boss: కక్కుర్తి పడి హౌస్ లో ఉన్న అఫైర్స్ లీక్ చేసిన గీతూ..!

-

బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగా సాగింది అని చెప్పాలి. స్వయంగా బిగ్ బాస్.. హౌస్ లో తన బర్తడే జరుపుకున్నారు. బర్తడే నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఆయనను ఎంటర్టైన్ చేయాలని ఆదేశించగా మధ్య మధ్యలో ఆయన సర్ప్రైజ్ లకు కూడా రెస్పాండ్ కావాలని సూచించారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు కంటెస్టెంట్ లు కూడా తమ తమ స్థాయిలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలోనే ఆర్జే సూర్య మిమిక్రీ చేయగా , ఫైమా కామెడీ స్కిట్స్ తో నవ్వులు పూయించింది. ఇక ఒక సాంగ్ కి శ్రీహాన్, శ్రీ సత్య అదిరిపోయే కెమిస్ట్రీ కురిపిస్తుంటే.. అర్జున్ ముఖం మాత్రం వాడిపోయిందనే చెప్పాలి. ఇక మనకు నచ్చిన అమ్మాయి వేరే అబ్బాయికి దగ్గరవుతుందే అని నొచ్చుకోవడానికి లేకుండా తన మనసులో తానే కుమిలిపోయాడు.

ఇక అనంతరం సీక్రెట్ రూమ్ లోకి గీతూ ని పిలిచిన బిగ్ బాస్ వేడివేడి చికెన్, కోక్ ఆఫర్ చేశాడు. హౌస్ కి సంబంధించిన మంచి గాసెప్ చెప్తే చికెన్ తినవచ్చు అని కూడా చెబుతాడు . దానికి గీతూ ఇనయ , ఆర్జె సూర్య మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది. సూర్యా అయితే రెస్పాండ్ అవ్వడం లేదు కానీ ఇనయాకు ఆయనపై రగులుతోంది మొగలి పొద అని చెప్పింది. అలాగే శ్రీ సత్య ను లైన్ లో పెట్టడానికి అర్జున్ తెగ ట్రై చేస్తున్నాడు అని , ఇందాక శ్రీ సత్య శ్రీహాన్ తో డాన్స్ చేస్తున్నప్పుడు అతడు మొఖం మాడిపోయిందని.. ఇక బాలాదిత్య ఎప్పుడు దీపు దీపు అంటున్నాడని అది నచ్చడం లేదు అని వరుసగా మూడు గాసిప్ లు చెప్పింది.

ఇక మొదటి గాసిప్ చెప్పినపుడు చికెన్ వాసన చూడమని చెప్పిన బిగ్ బాస్ ఆ తర్వాత ఎట్టకేలకు ఆమెను చికెన్ తినమన్నాడు. అరగంటకు పైగా సీక్రెట్ రూమ్ లో ఉన్న గీతూ తో బిగ్ బాస్ ఏం చెప్పాడనే క్యూరియాసిటీ అందరిలో కూడా కలిగింది.. దాన్ని కూడా గీతూ మైండ్ గేమ్ ఆడి బిగ్ బాస్ తన గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నాతో వీడియోలు చూపించాడని అబద్ధం చెప్పింది . ఇక బిగ్ బాస్ ఇచ్చిన చికెన్ ఎవరికీ పెట్టకుండా ఊరించుకుంటూ తినేసింది. కేవలం చికెన్ కోసం హౌస్ లో ఉన్న ఎఫైర్స్ అన్నింటిని బయటపెట్టింది గీతూ..

Read more RELATED
Recommended to you

Latest news