విజయదశమి రోజు దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత..మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజిస్తారు. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. ఇఛ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దేపితం చేస్తుంది. అనంత శక్తిస్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అధిష్టాన దేవత. పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకుని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే సకల విజయాలు వరిస్తాయి.
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం పుట్టిన రోజే విజయదశమి అంటారు. ఏపనైనా తిథి,వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం చూసుకుంటారు. కానీ విజయదశమిరోజు ఏ సమయంలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయం తథ్యం అంటారు. ఈ పర్వదినంలో చేసే శమీపూజ చాలా విశేషమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్షాన్ని పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొందుతారు..ఈ రోజు దుర్గమ్మ కు ఈ అష్టకాన్ని చదివితే మంచి జరుగుతుందని అందరి నమ్మకం..
శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం..
అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమావతీ శివాత్రిణయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1 ||
అంబామోహినిదేవతా త్రిభువనీ ఆనంద సంధాయినీ
వాణీ పల్లవపాణి వేణు మురళీ గాన ప్రియలోలినీ
కళ్యాణీ ఉడురాజ బింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 2 ||
అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హారావళీ
జాజీచంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా
వీణావేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 3 ||
అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండీ శ్రిత పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 4 ||
అంబా శూలధనుః కశాంకుధరీ అర్ధేందు బిబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసుర మూక దైత్యదమ్నీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 5 ||
అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓమ్కారాదినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 6 ||
అంబా శాంకరి ఆగమాదివినుతా ఆర్యామహాదేవతా
యాబ్రహ్మాదిపిపేవికాంత జననీ యావై జగన్మోహినీ
య పంచ ప్రణవాది రేఫజననీ యాచిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 7 ||
అంబ పాలిత భక్త రాజిరనిశం అంబాష్టకం యఃపటేత్
అంబాలోక కటాక్ష వీక్షలతా ఐశ్వర్య సమృద్దితా
అంబోపాసన మంత్ర రాజపఠ నాదంత్యే చ మోక్ష ప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 8 ||
ఈ అష్టకాన్ని చదివితే సకల విజయాలు కలుగుతాయి..యావత్ ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు..