Big Boss OTT Telugu: వరస్ట్ పర్ఫార్మర్ బిందు మాధవి..భౌతిక ఘర్షణకు దిగిన నటరాజ్, శివ తర్వాత ఏం జరిగిందంటే?

-

ఆరో వారంలో ‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఎదురు కాబోతున్నట్లుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలతో వీకెండ్ షో రసవత్తరంగా ఉండబోతున్నదని అర్థమవుతోంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతో ఇక షో నెక్స్ట్ లెవల్ కు వెళ్లొచ్చు. అయితే, ఎలిమినేషన్ కన్న ముందు ‘బిగ్ బాస్’ ఇంపార్టెంట్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యులలో చెత్త పర్ఫార్మర్ ను సెలక్ట్ చేసి రీజన్స్ చెప్పాలన్నాడు.

ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ బిందు మాధవి పేరును సెలక్ట్ చేసినట్లు ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు షోలో సత్తా చాటిన బిందు మాధవి ఆరో వారం వరస్ట్ పర్ఫార్మర్ అయిపోతుండటం చూసి బీబీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది బీబీ ఇంటి సభ్యులు బిందు మాధవి పేరును ప్రస్తావించి ఆమె ముఖంపై ఇంటూ మార్కు కొట్టినట్లుంది. ఆమె త్రీ హండ్రెడ్ కాయిన్స్ పోగొట్టుకుందని, అదే కారణమని తెలిపారు.

బిందు మాధవి ఫ్రెండ్ శివ కూడా బిందునే వరస్ట్ పర్ఫార్మర్ గా నామినేట్ చేయడం గమనార్హం. గేమ్‌లో నిర్లక్ష్యం ప్రదర్శించింది బిందు మాధవినేనని ఆమెకు ట్యాగ్ ఇచ్చారు. అయితే, బిందు మాధవి ఏ మాత్రం బెదరకుండా హౌజ్ మెట్స్ అందరికీ రిప్లయి ఇచ్చేసింది. తన ఆట తీరును సమర్థించుకుంటూనే కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బిందు మాధవికి, అఖిల్ కు మధ్య ఫైట్ జరిగినట్లుంది. ఇక చివరకు తప్పక బిందు మాధవి జైల్లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. మరో వైపున నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య స్ట్రీట్ ఫైట్ షురూ అయింది.

నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ మధ్య ‘బస్తీ మే సవాల్’ అన్నట్లు ఫైట్ సీన్ జరిగింది. వీరు గొడవ పడకుండా కెప్టెన్ అషురెడ్డి కాపాడింది. దూషణల పర్వం కూడా స్టార్ట్ అయింది. నటరాజ్ మాస్టర్ యాంకర్ శివను బూతులు తిట్టారు. చివర్లో నటరాజ్ మాస్టర్ మాస్ డైలాగ్ చెప్పేశాడు. ‘నటరాజ్ కు ఒళ్లంతా కళ్లే’ అని అన్నాడు. మొత్తంగా ఈ వీకెండ్ షో చాలా రసవత్తరంగా సాగబోతున్నదని అర్థమవుతున్నది. చూడాలి మరి.. పూర్తి ఎపిసోడ్ చూస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news