ఫ్యాక్ట్ చెక్: వేసవిలో పెట్రోల్ ట్యాంక్​ ఫుల్​ చేస్తే ప్రమాదకరమా..?

-

తరచూ మనం సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. అయితే మరి అది నిజమా..? కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎండాకాలం బండ్లలో పెట్రోల్ ట్యాంక్​ ఫుల్​ చేస్తే ప్రమాదకరం అని ఈ వార్త లో వుంది. అయితే దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. తాజాగా ఓ వార్త చమురు మార్కెటింగ్ సంస్థ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పేరుపై వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో వాహనదారులను ఐఓసీ హెచ్చరిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. ఎండలు మండపోతున్నందున వాహనాల్లో పెట్రోల్​ లేదా డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించకండి. అలా చేయడం వలన పేలుళ్లు సంభవించే ప్రమాదముంది అని ఆ వార్త లో వుంది. పైగా ఇప్పటికే ఈ వారంలో ఐదు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి అని కూడా వ్రాసారు.

రోజులో కనీసం ఒకసారైనా పెట్రోల్ ట్యాంక్ తెరవడం ద్వారా లోపల ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. పైగా ఈ విషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపండి అని ఆ మెసేజ్ లో వుంది. తమ సంస్థ పేరు మీద ఈ వార్త వైరల్​ అవుతున్న నేపథ్యంలో ఐఓసీ క్లారిటీ ఇచ్చింది. ఇది కేవలం ఫేక్ వార్త అని ఏ సర్కులర్ ని తీసుకు రాలేదు అని చెప్పింది. నిజానికి ఇదే విషయం పై 2019లోనే క్లారిటీ ఇచ్చింది సంస్థ.

 

Read more RELATED
Recommended to you

Latest news